కొత్త ఫీచర్‌ : ఫేస్‌బుక్‌లో వాట్సాప్‌... | Sakshi
Sakshi News home page

కొత్త ఫీచర్‌ : ఫేస్‌బుక్‌లో వాట్సాప్‌...

Published Sat, Sep 23 2017 11:33 AM

Facebook tests WhatsApp shortcut in its app  - Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో : సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ మరో కొత్త ఫీచర్‌ను టెస్టింగ్‌కు తీసుకొచ్చింది. ఫేస్‌బుక్‌ యాప్‌ నుంచే డైరెక్ట్‌గా వాట్సాప్‌ను వాడుకునేలా యూజర్లకు అవకాశం కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ఫామ్‌పై కొంత మంది యూజర్లకు ఫేస్‌బుక్‌ యాప్‌లో వాట్సాప్‌ బటన్‌ కూడా కనిపిస్తోందని తెలిసింది. షార్ట్‌కట్‌లా ఇది పనిచేస్తోందని నెక్ట్స్‌ వెబ్‌ రిపోర్టు చేసింది. ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ కలిగి ఉన్న కొంతమంది యూజర్లకు ప్రస్తుతం యాప్‌ మెనూలో ఈ కొత్త బటన్‌ దర్శనమిస్తోందని పేర్కొంది. కొంత మంది ఐఓఎస్‌ యూజర్లకు ఇది అందుబాటులో ఉందని తెలిపింది. 

అయితే దీనిపై ఫేస్‌బుక్‌ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. యూజర్లందరికీ ఈ ఫీచర్‌ అందుబాటులోకి తీసుకొస్తుందో లేదో స్పష్టత ఇవ్వలేదు. ఈ ఫీచర్‌ గురించి తొలుత అరవింద్‌ అయ్యర్‌ అనే ఫేస్‌బుక్‌ యూజర్‌ రిపోర్టు చేశారు. యాప్‌ భాషను డానిష్‌కి సెట్‌ చేసుకున్న అనంతరం ఈ కొత్త షార్ట్‌కట్‌ కనిపించిందని తెలిపారు. ప్రస్తుతం ఫేస్‌బుక్‌ ''ఇన్‌స్టాంట్‌ వీడియోస్‌'' అనే కొత్త ఫీచర్‌పై పనిచేస్తోంది. యూజర్ల డేటా పొదుపు చేసేందుకు వై-ఫై కనెక్ట్‌ అయి ఉన్న సమయంలో ఫేస్‌బుక్‌ వీడియోలు డౌన్‌లోడ్‌ అయ్యేలా ''ఇన్‌స్టాంట్‌ వీడియోస్‌'' ఫీచర్‌ పనిచేయనుంది. 

Advertisement
Advertisement